దసరాముహూర్తం ఫైనల్   

0
TMedia (Telugu News) :

దసరాముహూర్తం ఫైనల్                                                                                                                          – ముఖ్య పార్టీ నేతలకు ఆహ్వానం

-జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ..?

 

టీ మీడియా,సెప్టెంబర్ 29,హైదరాబాద్: కేసీఆర్ సంచలన ప్రకటన దిశగా ముహూర్తం ఫిక్స్ అయింది. కొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ..కొత్త పార్టీ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక, దీని పైన అధికారికంగా ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పార్టీ పేరుతో పాటుగా జెండా -అజెండా ను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం చేసారు. అక్టోబర్ 5న దసరా నాడు పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటుగా ఎంపీలు – ఎమ్మెల్సీలు- ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని పార్టీ సూచించింది. దసరా నాడు కీలక ప్రకటన ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుతూ తీర్మానాలు చేసారు.

మారకుంటే మార్చేస్తా

అటు ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అమలు చేస్తున్న విధానాల పైన అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ నిలదీస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తమిళనాడు – బీహార్ – ఢిల్లీ- జార్ఖండ్- పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించారు. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సుదీర్ఘ సమావేశం జరిపారు. బీహార్ వెళ్లిన సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఏకమవుతామని కేసీఆర్ – నితీశ్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన – కార్యాచరణ ప్రకటించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube