ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు ఎప్రియల్ 15 తుది గడువు

టీ మీడియా, మార్చి 30,హైదరాబాద్:

1
TMedia (Telugu News) :

*ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు పొడిగింపు – *
-ఎప్రియల్ 15 తుది గడువు

టీ మీడియా, మార్చి 30,హైదరాబాద్:

ముఖ్యమంత్రి శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు.

ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయల ని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందనీ, మరియు రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

ALSO READ;బడి వేళలను తగ్గించారు

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు రావడం జరిగినందున ప్రజల వద్ద నుండి వచ్చిన స్పందన మరియు విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి మరో పదిహేను రోజుల పాటు ఎప్రియల్ 15 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ALSO READ;దుర్గగుడిలో మరో వివాదాస్పద ఘటన

ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.
ఈ క్రింద విధముగా వివిధ రకాల వాహన యజమానులకు ఈ క్రింది విధముగా రాయితిని నిర్ణయించడం అయినది టు వీలర్స్ వారుకట్టండి 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ
ఆర్టీసీడ్రైవర్స్ కట్టండి 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ,
• కట్టండి 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫ్,
• తోపుడు బండ్ల వ్యాపారులు కట్టండి 2o%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ,
• నో మాస్క్ కేసులు- కట్టండి Rs 100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ,
బకాయిలు చెల్లింపు కోరిన మోటారు వాహన యజమనులు అన్ని విధముల ఆన్లైన్ సేవా చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా గాని చెల్లించవచ్చు.

ALSO READ;పాడె మోసిన మంత్రి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube