భాగ్యనగరంలో ఆషాఢ బోనాల తేదీలు ఖరారు
టి మీడియా, జూన్6 హైదరాబాద్ : హైదరాబాద్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే ఆషాఢ బోనాలకు ముహుర్తం ఖరారైంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి బోనాల వేడుకపై సమీక్ష నిర్వహించి, తేదీలను ఖరారు చేశారు.ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. జులై 24న భాగ్యనగర బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు నిర్వహించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
Also Read : భార్యను ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టాడు..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube