జనన, మరణ ధృవీకరణ ఇబ్బందులు

కొత్త నిబంధనలు

1
TMedia (Telugu News) :

జనన, మరణ ధృవీకరణ ఇబ్బందులు
-కొత్త నిబంధనలు
టీ మీడియా, మార్చి 14, వనపర్తి : జనన మరణ ధృవీకరణ పత్రాలు తీసుకోవాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఇద్దరూ ప్రభుత్వ గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ కావాలని రూల్స్ పెట్టారు. దీనివలన జనన,మరణ ధృవీకరణ పత్రాలు గత కొద్ది రోజులుగా ఎమ్మార్వో కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. ప్రజల చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. గెజిటెడ్ అధికారులు సంతకాలు చేస్తే మాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసి సంతకాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

Also Read : సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

అయినా ఒక ఆర్ఐ,విఆర్వో ధ్రువీకరణ చేసిన తర్వాత కూడా మళ్లీ ఇద్దరు గెజిటెడ్ అధికారులు సంతకాలు చేయాలంటే పేద ప్రజలు చదువురాని వారు గెజిటెడ్ అధికారి ఎవరు అతను ఎక్కడ ఉంటాడు అని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున పేద ప్రజలను నిరక్షరాస్యులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఇద్దరు గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ రూల్స్ ను ఎత్తివేయాలి, లేకుంటే పాత పద్ధతిలోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ప్రజల కోరుతున్నారు. లేకుంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రి గెజిటెడ్ అధికారికి గాని, పాఠశాల ప్రిన్సిపాల్ కి కాని ఈ భాధ్యతను అప్పగిస్తే బాగుంటుందని కోరుతున్నారు.ఈ సందర్భంగా సమాచార హక్కు వికాస సమితి సభ్యులు గంధం రవికుమార్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube