విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

1
TMedia (Telugu News) :

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

టీ మీడియా, సెప్టెంబర్ 14, వనపర్తి బ్యూరో : భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17న అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి బైక్ ర్యాలీ ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఉన్న సంస్థానాల అన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేయడం జరిగింది. తెలంగాణ సంస్థానం,నిజాం నిరంకుశ పరిపాలన సంస్థానాన్ని, ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసి తెలంగాణకి విమోచన దినంగా ప్రకటించడం జరిగింది.

Also Read : గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం దరఖాస్తు అందజేత

టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతాము అని ప్రకటించి 8 సంవత్సరాలుగా గడుస్తున్న జరపకుండా ఎంఐఎం కబంధహస్తాలు పనిచేస్తుందని వాపోయింది.ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బి కృష్ణ, జిల్లా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కో- కన్వీనర్ జింకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, మాధవరెడ్డి, శ్రీశైలం, బండారు కుమార్ స్వామి, రామన్న, వెంకటేశ్వర్లు, సీతారాములు, సుమిత్రమ్మ, పరశురాములు, కదిరి మధు, రాజశేఖర్ గౌడ్, గజరాజుల తిరుమలేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube