పట్టపగలే వీధీ దీపాల వెలుగులు
-అప్రకటిత విద్యుత్ కోతలు
టీ మీడియా, మే 26, మహానంది: విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా, అధికారులకు మాత్రం అది పట్టడంలేదు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలు పట్టపగలే వెలుగుతుండడంతో విద్యుత్ వృథా అవుతోంది.మహానంది మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. గ్రామ పంచాయతీలో ఒక్క ఒక్క చోట కూడా వీధి దీపాలకు ఆన్ ఆఫ్ ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యుత్ వృథా అవుతోంది.దీంతో వీధి దీపాలు రాత్రి, పగలు అనే తేడాలేకుండా వెలుగుతూనే ఉన్నాయి. ఎన్నోరోజులుగా ఇలా వెలుగుతున్నా పంచాయతీ, విద్యుత్ అధికారులు దృష్టి పెట్టడంలేదు. ఇప్పటికైనా స్పందించి వీధి దీపాలకు స్విచ్‌లు ఏర్పాటు చేసి విద్యుత్ వృథాను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Also Read : పోలీస్ స్టేషన్ ల ఆకస్మిక తనిఖీ చేసిన ఇంచార్జ్ డీసీపీ
అప్రకటిత విద్యుత్ కోతలతో రాత్రి పూట ప్రజల అవస్థలు
విద్యుత్ శాఖ అధికారులు కోతలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాత్రిపూట కరెంటు తీసివేస్తున్నారు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, గృహిణులు, విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా ఎలాంటి ప్రకటన చేయకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తూ ఉండడంతో స్థానిక గ్రామ ప్రజలు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.