సాగర తీరంలో.. అబ్బురపరిచే సాహస విన్యాసాలు

సాగర తీరంలో.. అబ్బురపరిచే సాహస విన్యాసాలు

1
TMedia (Telugu News) :

సాగర తీరంలో.. అబ్బురపరిచే సాహస విన్యాసాలు!

టీ మీడియా ,డిసెంబర్ 5, విశాఖపట్నం :ఆర్కే బీచ్‌లో నౌకాదళ దినోత్సవం సందర్భంగా దళ విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. ఐఎన్‌ఎస్‌ సింధు వీర్‌ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది.ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నౌకాదళ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఏపీ మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్‌, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన నౌకాదళ గీతం ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్‌ జన సంద్రంగా మారింది.

Also Read : కల్తీ కల్లుతో ఆరోగ్యానికి చిల్లు\

నేవీ డే హైలైట్స్‌..
జెమినీ బోట్‌లోకి హెలికాప్టర్‌ నుంచి దిగిన మెరైన్‌ కమాండోలు సముద్ర జలాలపై అత్యంత వేగంగా ఒడ్డుకు దూసుకొచ్చారు.
నౌకాదళ కమాండో బృందం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఉత్కంఠకు గురి చేసింది.
త్రివర్ణ పతాక రెపరెపలతో గగన వీధుల్లో హెలికాప్టర్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
త్రివర్ణ ప్యారాచూట్‌లో దిగిన స్కై డైవర్‌ అనూప్‌ సింగ్‌ రాష్ట్రపతికి నౌకాదళ ప్రత్యేక ప్రచురణ ప్రతిని అందించి ఆవిష్కరింపజేశారు.
సాహస విన్యాసాల కోసం ఎన్‌ఎస్‌ కంజీర్‌, కడ్మత్‌ నుంచి సముద్రంపై ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ, ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి యుద్ధనౌకలు ఉపయోగించారు.
మిగ్‌ 29 యుద్ధ విమానాలతో గగనతలంలో విన్యాసాలు గగుర్పాటుకు గురిచేశాయి.
యుద్ధనౌకలు, సబ్‌ మెరైన్ల నుంచి ఒకేసారి రాకెట్‌ ఫైరింగ్‌ ఆకట్టుకుంది. రాత్రి వేళ సముద్రంపై విద్యుత్‌ కాంతులీనుతూ యుద్ధనౌకలు అబ్బురపరిచాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube