వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్24, మధిర:

మధిర మండలం సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కొనలేము అని చేతులెత్తేసిన సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భారం అయినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని దానిలో భాగంగానే సిరిపురం గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులు సస్యశ్యామలంగా ఉండడంతో రైతులందరూ వరి పంటను ఎంచుకోవడం వల్ల దాన్యం కొనుగోలు కొంత ఇబ్బందికరంగా ఉండడం వలన యాసంగి లో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర మండల సిరి పురం గ్రామం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

Zilla Parishad Chairman Lingala Kamal Raju and DCMS Chairman Rayala Seshagiri Rao inaugurated the Paddy Grain Purchase Center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube