ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి

1
TMedia (Telugu News) :

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు

-రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి

-నేర ప్రవర్తన మార్చుకోకపోతే పిడి యాక్ట్ తప్పవు

పెద్దపల్లి ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్

టి మీడియా, జూన్ 14,గోదావరిఖని :1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో గల 60 మంది రౌడీషీటర్లుకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

Also Read : భూ సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి హరీశ్‌ రావు

ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ ఐపిఎస్ మాట్లాడుతూ… వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవుత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలన్నారు. శాంతి భద్రతలకు మరియు ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, షీటర్లపై పిడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకాడమన్నారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైన్డోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలు మరియు ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది.బైండొవర్ కాలంలో ఏదైనా నేరం కు పాల్పడినట్లు అయితే జరిమానా తో పాటు గా జైలు శిక్ష కూడా పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సత్పవర్తనతో మెలగాలి, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Also Read : మున్సిపల్ కమిషనర్ ను కలిసిన కేంద్ర గ్రంథాలయ కమిటీ

అదేవిదంగా గతంలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడి పలు నేరాల్లో పాలుపంచుకున్న వ్యక్తుల పై రౌడీషీట్స్, సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరిగిందని అలాగే ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుసున్న రౌడీ షీట్లకు శిక్షలు పడేలా చూస్తామని పెద్దపల్లి ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ గారు తెలిపారు.

Also Read : మంత్రి విశ్వరూప్‌ అనుచరులపై కేసు

ఈ సమావేశంలో గోదావరిఖని సబ్ డివిజన్ ఎసిపి గిరి ప్రసాద్ , గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు,రాజ్ కుమార్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు , మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ ,రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ,సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube