మరణానంతరం శరీరాలను దానం

జెడ్పీటీసీ సంధ్యారాణిపోచం దంపతులు

1
TMedia (Telugu News) :

మరణానంతరం శరీరాలను దానం
జెడ్పీటీసీ సంధ్యారాణిపోచం దంపతులు

టి మీడియా,ఏప్రిల్ 30, గోదావరిఖని :మరణించడం,జన్మించడం ఎవరికైనా తప్పదు అని, అందుకే మరణానంతరం తమ శరీరం పది మందికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో సదాశయ ఫౌండేషన్ కు తమ పెళ్లి రోజు సందర్భంగా తమ మరణానంతరం శరీరాలను దానం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు కందుల సంధ్యారాణి పోచం దంపతులు.బతికి ఉన్నన్ని రోజులు ప్రజాసేవకు అంకితమైన తమ శరీరం మరణానంతరం కూడా పది మందికి ఉపయోగపడాలనేది తమ కోరిక అని సంతోషం వ్యక్తం చేశారు కందుల దంపతులు.ఈమేరకు గురువారం సాయంత్రం ఒప్పంద పత్రాలను ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మహిళా తెరాస నాయకురాలు మాట్లాడుతూ…దానాలు ఎన్నో కడుపు నింపే అన్నదానం మంచిదే.

Also Read : కేంద్రానికే చికిత్స చేయాలి : సీఎం కేసీఆర్

జీవితాలనిచ్చే విద్యాదానం మంచిదే,కానీ అవయవ దానం,శరీర దానం అలాకాదు,ఎంతోమందికి కొత్త జీవితాలనిస్తుంది. వాడిపోయిన జీవితాలను చిగురింపజేస్తుంది.ఆశలు అడుగంటిపోయినవారికి కొత్త ఆశలను చిగురింపజేస్తుంది.అదే శరీర,అవయవ దానంలోని గొప్పదనం,డబ్బులిస్తే,అవసరం తీరిపోయాక మర్చిపోతారు.అదే శరీర, అవయవ దానం అయితే కొత్త జీవితాలను ప్రసాదించినవారవతారు. ఒక మనిషి చనిపోతూ కూడా చేసే అత్యంత దానం అవయవ దానం.మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు అని అన్నారు. మరణానంతరం అత్యంత విలువైన అవయవాలను మట్టి పాలు చేయడం కన్నా అవయవ లోపాలతో బాధపడుతున్న వారికి అందజేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించడంలోనే అసలైన ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిపారు. శరీర దానానికి సమాజసేవకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు.

Also Read : యాద‌గిరిగుట్ట‌లో కుప్ప‌కూలిన భ‌వ‌నం..

డబ్బు సంపాదించడం కన్నా.. పేరు సంపాదించడం కొరకే తన జీవితాన్ని అంకితం చేశానని తెలిపారు. ప్రజా సేవకురాలిగా డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాన్ని స్వచ్ఛంద సంఘాల బాద్యులు,ప్రజలు, నాయకులు,మేధావులు అభినందించడం కొసమెరుపు.సదాశయ ఫౌండేషన్ లింగమూర్తి, మనస్స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కండే సాగర్,మచ్చల శ్రీనివాస్, రమాదేవి,సింగిరెడ్డి మల్లారెడ్డి మంజుల, కవిత,లక్మి, నీరజ,అజయ్,తాజ్, మధు,సునీల్,సాగర్, సుజిత్,రేవంత్,శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube