అనుమాన స్పద స్థితిలో మహిళ మృతి

అనుమాన స్పద స్థితిలో మహిళ మృతి

1
TMedia (Telugu News) :

అనుమాన స్పద స్థితిలో మహిళ మృతి
టి మీడియా,మార్చు 29 ,రామకృష్ణాపూర్:పట్టణంలో ని నాగార్జున కాలనీ లో వివాహిత కోటగిరి వర్షిత(35) అనే మహిళ మంగళవారం అనుమాన స్పద స్థితిలో మృతి చెందింది.మందమర్రి సి.ఐ ప్రమోద్ రావ్,పట్టణ ఎస్.ఐ సుధాకర్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఎస్.ఐ సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కోటగిరి నర్సింహ చారి, వర్షిత లకు 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది.సుమారు ఐదు ఏండ్లుగా నాగార్జున కాలనీ లో నివాసం ఉంటున్నారు. నరసింహ చారి స్థానిక ఓ.సి లో కాంట్రాక్టు విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం రాత్రి డ్యూటీ ముగించుకొని మంగళవారం ఉదయం 8.30 ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి తలుపులు తీయకపోవడం తో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా బాత్రూమ్ లో విగిత జీవిగా పడి ఉందని తెలిపారు. వర్షిత ఒంటి పై ఎలాంటి గాయాలు లేవని,హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని, పోస్టుమార్టం అనంతరం మృతి కి గల కారణాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.

Also Read : బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube