పిల్లల మరణం తల్లితండ్రులకు జీవితంలో తీరని దుఃఖం

పిల్లల మరణం తల్లితండ్రులకు జీవితంలో తీరని దుఃఖం

0
TMedia (Telugu News) :

పిల్లల మరణం తల్లితండ్రులకు జీవితంలో తీరని దుఃఖం

– మంత్రి జూపల్లి కృష్ణారావు

టీ మీడియా, డిసెంబర్ 19, వనపర్తి బ్యూరో : పాన్ గల్ మండలం దవాజిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిన్న రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అన్నారం – దవాజి పల్లి మధ్యలో డీసీఎం డి కొట్టడంతో ఇద్దరు యువకులు మరణించారు. శ్రీకాంత్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ లో రోడ్ ప్రమాదంలో మరణించిన గడ్డం రాంబాబు (22), గడ్డం శివ(19) అనే ఇద్దరు యువకుల భౌతికకాయలను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణ డిప్యూటీ సీఎం ను కలిసిన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube