సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుని మృతి

పార్టీ జెండా కప్పి నివాళులఅర్పించిన పోతినేని

1
TMedia (Telugu News) :

సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుని మృతి

-పార్టీ జెండా కప్పి నివాళులఅర్పించిన పోతినేని
టీ మీడియా,సెప్టెంబర్20,ఎర్రుపాలెం: మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామానికిచెందిన సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడుపెరుమాళ్ళ వెంకటరామయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.ఇటీవల కొద్ది రోజులనుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు.వెంకట్రామయ్యమృతి చెందినవార్తతెలియగానే రాష్ట్ర సిపిఎంపార్టీ కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు,జిల్లా నాయకులు మాదినేని రమేష్,మధిర నియోజవర్గ ఇన్చార్జి చింతలచెరువు కోటేశ్వరరావు,మండల కార్యదర్శి దివ్వెలవీరయ్య విచ్చేసి వెంకట్రామయ్య పార్థివదేహంపై సిపిఎం పార్టీ జెండానుకప్పి పూలమాలలువేసి ఘనమైన నివాళులు అర్పించారు.

Also Read : అనధికార కట్టడాల చర్యలు చేపట్టాలి

ఈ సందర్భంగా సుదర్శన్ రావుమాట్లాడుతూపార్టీ అభివృద్ధికి గ్రామంలో ఎంతో కృషి చేశారని,ఈరోజు వెంకటరామయ్య మన మధ్యలో లేకపోవడం బాధాకరంగాఉందని అన్నారు.అతడు లేకపోవడంపార్టీకితీరని లోటనిఅన్నారు.కుటుంబ సభ్యులనుపరామర్శించి తన ప్రగాఢసానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులుగొల్లపూడి కోటేశ్వరరావు, గామాసుజోగయ్య,ఎర్రమల శ్రీనివాస్ రెడ్డి,సగ్గుర్తి సంజీవరావు,షేక్ లాల,బేతి శ్రీనివాసరావు,నల్లమోతు హనుమంతరావు,నాగులవంచ వెంకట్రామయ్య,కూడెల్లినాగేశ్వరరావు,బండారు ఉపేంద్ర,నాగరాజు,మేకల పుల్లయ్య,యుటిఎఫ్ మండల కమిటీ నాయకులు అనుమోలు కోటేశ్వరరావు,బండారుపల్లి రాజారావు,నీలంఅజయ్ కుమార్ తదితరులు నివాళులర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube