దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆత్మహత్య యత్నం
– బి అర్ ఏస్ నేత బెల్లం వేణు వేదింపులు
టీ మీడియా,ఫిబ్రవరి7,ఖమ్మం : నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత మంగళ వారంఆత్మహత్యాయత్నం చేశారు .ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్లం వేణు దూషించాడని మనస్థాపానికి గురై తన కార్యాలయంలోనే ఆత్మహత్యకి యత్నం చేసింది.మంగళవారం విధి నిర్వహణ లో బాగంగా కూసుమంచి లోని శివాలయం కు సమత వెళ్ళారు. అక్కడ విధుల్లో ఉం డగా ఖమ్మం రూరల్ మండలం మారెమ్మ గుడి కమిటీ గురించి ఫోన్ చేసిన వేణు, నాకు చెప్పకుండా కమిటీ ఎలా ఫైనల్ చేస్తావు అంటూ ఫోన్ లో బెదిరింపులు చేయడం తో పాటు,భూతులు తిట్టారు.
దీనితో మనస్తాపం కు గురి అయిన సమత నగరం లోని కా లవొడ్డు లోని కార్యాలయానికి వచ్చి నిద్ర మాత్రలు మింగారు.తోటి ఉద్యోగులు హుటా హుటిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు..విషయం తెలిసి పెద్ద సంఖ్యలో దేవాదాయ శాఖ ఉద్యోగులు ఆస్పత్రి వద్ద కు చేరు కొన్నారు.టి ఎన్ జి వో నాయకులు కూడా అక్కడి కి చేరు కొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పిర్యాదు మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
WhatsApp Audio 2023-02-07 at 2.50.11 PM
Also Read : సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొరట్ రాజీనామా
ఆస్పత్రి వద్ద ఉద్యోగులు ధర్నా
సమత ఆత్మహత్యకు కారణం అయిన బెల్లం వేణు పై తక్షణమే చర్యలుతీసుకొని,అరెస్ట్ చెయ్యాలి అంటూ దేవాదాయ శాఖ ఉద్యోగులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.ఈ సందర్భం గా దేవాదాయ శాఖ ఉద్యోగులు సంఘం అద్యక్షు లు తోటకూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తక్షణ చర్యలు లేకపోతే అవసరం అయితే నిరవధిక ఆందోళన చేస్తాము అన్నారు.కార్య క్రమం లో టి ఎన్ జి ఓ నాయకులు శ్రీనివాసరావు, జ్యోతి,ప్రవీణ్,కావూరి ఆనంద్,సూర్య ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.