మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం
– మాజీ మంత్రి చిన్నా రెడ్డి
టీ మీడియా, ఏప్రిల్ 25, రేవల్లి : వనపర్తి పట్టణంలో నివాసం ఉంటున్న కేశంపేట గ్రామానికి చెందిన మెట్టల యాదమ్మ ఆనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు జిల్లెల చిన్నా రెడ్డి మంగళవారం వనపర్తి లో ఆమె ఇంటి దగ్గరకి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి రూ. 5000లు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క చురుకైన మహిళ కార్యకర్తను పోగొట్టుకున్నది అని ఆమె పార్టీ కోసం చాలా పని చేసింది అని ఆమె మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆమె మృతికి సంతాపం తెలియచేశాడు. ఆయన వెంట కేశంపేట గ్రామ పార్టీ నాయకులు సురేష్ గౌడ్, కార్యకర్తలు పాల్గొని సంతాపం తెలిపారు.