కొత్త రేషన్‌ కార్డులపై త్వరలో నిర్ణయం

కొత్త రేషన్‌ కార్డులపై త్వరలో నిర్ణయం

0
TMedia (Telugu News) :

కొత్త రేషన్‌ కార్డులపై త్వరలో నిర్ణయం

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 12, హైదరాబాద్‌ : పేదలకు నాణ్యమైన రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 12 శాతం వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించలేదని చెప్పారు. కొందరు రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. సచివాలయంలో యాసంగి, వర్షాకాంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యత అధికారులు మంత్రికి వివరించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రూ.56 వేల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ హామీ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Also Read : ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube