పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి

సిపిఐ డిమాండ్

2
TMedia (Telugu News) :

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఐ డిమాండ్
టీ మీడియా, మార్చి25, మధిర:పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలనిసిపిఐ పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ వి కాంప్లెక్స్ దగ్గర ధర్నానిర్వహించారు.ఈసందర్బంగా సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు బెజవాడ రవి, ఊట్ల కొండలరావు లు ధర్నా నుద్దేశించిమాట్లాడుతూ….కేంద్రం లో మోడీ ప్రభత్వం వచ్చిన దగ్గరనుంచి ప్రజలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఒకపక్క కరోనా బారినపడి పేద మధ్యతరగతి ప్రజలు ఆర్ధికంగా చితికిపోయి బ్రతుకులను భారంగా ఈడుస్తుంటే ప్రజలను రక్షించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు.ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తెలంగాణా ప్రభుత్వం కెసిఆర్ కూడా కరెంట్ చార్జిలను, ఆర్టీసీ టిక్కెట్ రెట్లను పెంచి మోడీకి మించినవాడుగా తయారయ్యాడని తీవ్రంగా దుయ్యబట్టారు.ఈ ధర్నా కార్యక్రమం లో సిపిఐ జిల్లాసమితి సభ్యులు ప్రకాశరావు, సిపిఐ మండల సహాయకార్యదర్శి చావా మురళి,ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు, సిపిఐ మండల నాయకులు రంగు నాగకృష్ణ,సిరివేరు శ్రీను, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, ఆటో యూనియన్ నాయకులు అక్కులు మొదలగు వారు పాల్గొన్నారు.

Also Read : ఉద్యోగుల జాతీయ క్రీడలకు ఎంపిక

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube