డీప్‌ఫేక్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం..

నియంత్ర‌ణకు త్వ‌ర‌లో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

0
TMedia (Telugu News) :

డీప్‌ఫేక్ ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌రం..

నియంత్ర‌ణకు త్వ‌ర‌లో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

– కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌

టీ మీడియా, నవంబర్ 23, న్యూఢిల్లీ: డీప్‌ఫేక్ స‌మాజానికి ప్ర‌మాద‌క‌రంగా త‌యారైన‌ట్లు కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ అన్నారు. గురువారం వివిధ సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ నేప‌థ్యంలో కొత్త నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను వీలైనంత త్వ‌ర‌గా రూపొందించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. కొన్ని వారాల్లోనే ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు చెందిన ముసాయిదాను అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. మీడియా స‌మావేశంలో మంత్రి వైష్ణ‌వ్ మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్యానికి డీప్‌ఫేక్‌లు తీవ్ర ప్ర‌మాద‌క‌రంగా మారిన‌ట్లు వెల్ల‌డించారు. ర‌ష్మిక మందానా, కాజోల్‌, ప్ర‌ధాని మోదీకి చెందిన డీప్‌ఫేక్ వీడియోలు, ఇమేజ్‌లు ఇటీవ‌ల దుమారం రేపిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియా, ఏఐ కంపెనీల‌తో నిర్వ‌హించిన మీటింగ్‌లో నాలుగు అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు.

Also Read : సుప్రీంకోర్టు తొలి మ‌హిళా న్యాయ‌మూర్తి క‌న్నుమూత‌

డీప్‌ఫేక్‌ల‌ను గుర్తించ‌డం, పోస్టింగ్ చేయ‌కుండా నియంత్రించడం, వైర‌ల్ కాకుండా చూడ‌డం, రిపోర్టింగ్ వైఖ‌రి గురించి ప‌లు కంపెనీల‌తో చ‌ర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు. డీప్‌ఫేక్‌ల గురించి ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించే అంశం గురించి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని మంత్రి చెప్పారు. ప్ర‌భుత్వం, ప‌రిశ్ర‌మ‌లు, మీడియా క‌లిసి ప‌నిచేయాల‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube