వీధి కుక్కల దాడిలో దుప్పి మృతి

అధికారులకు సమాచారం ఇచ్చిన రైతు సాంబతిని పుల్లయ్య

1
TMedia (Telugu News) :

వీధి కుక్కల దాడిలో దుప్పి మృతి

అధికారులకు సమాచారం ఇచ్చిన రైతు సాంబతిని పుల్లయ్య

టీ మీడియా, మే01, మధిర:

మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో గత రాత్రి వీధికుక్కల దాడిలో దుప్పి మృతి చెందిన సంఘటన వెలుగుచూసింది.ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఖమ్మంపాడు గ్రామ పొలాల సమీపంలో వీధికుక్కలు వెంబడిస్తున్న దుప్పిని చూసిన రైతు సాంబతిని పుల్లయ్య కుక్కలను తరిమి గాయాలైన దుప్పిని స్వాధీనపరచుకొని పోలీస్ అధికారులకు హండ్రెడ్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వగా పోలీస్ సిబ్బంది సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలపగా ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది ఖమ్మంపాడు గ్రామానికి వెళ్లి దుప్పిని స్వాధీనపరచుకొని మధిర లోని ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్కు చూపించగా అప్పటికే దుప్పి మృతి చెందినట్లు వెటర్నరీ డాక్టర్ నిర్ధారించారనిఅని ఫారెస్ట్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. మృతి చెందిన దుప్పిని ఖననం చేసి నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఫారెస్ట్ సిబ్బంది డిఆర్ఓ సీతారాములు, బీట్ ఆఫీసర్ లు సురేష్, శ్రీను, రాజేంద్ర ఉన్నారు.

Also Read : మేడే స్ఫూర్తితోనే సమరశీల పోరాటాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube