టీ మీడియా నవంబర్ 30 వనపర్తి : వనపర్తి పట్టణంలోని పాతకోట హరిజనవాడ మధ్యలో కందకంలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ నిర్మాణ పనుల్లో కొద్ది మొత్తంలో సిమెంట్ అధిక మొత్తంలో ఇసుకను కలుపుతున్నారు. ఇక్కడ చేస్తున్న పనులకు క్యూరింగ్ (నీరు చల్లడం) లాంటిది అసలు చేయడమే లేదు. మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ అసలు కొనసాగడం లేదు మార్కెట్ యార్డ్ నిర్మాణానికి వాడే ఇసుకను రాత్రివేళలో ట్రాక్టర్ల ద్వారా పోసి పోవడం జరుగుతుంది. పోలీసు అధికారులు కూడా గమనించాలని కాలనీవాసులు కోరారు.