డిగ్రీ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామకం

డిగ్రీ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామకం

0
TMedia (Telugu News) :

     డిగ్రీ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియామకం

 

టీ మీడియా, ఏప్రిల్ 25, వనపర్తి బ్యూరో : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ కాలేజ్ గజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ కళాశాల లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ ఎన్నిక కావడం గర్వకారణం అని కల్వకోల్ గ్రామానికి చెందిన రవిశంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన డాక్టర్ మల్లికార్జున్ గెజిటెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల పర్యవేక్షణ అధికారి డాక్టర్ తిరుపతయ్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, వివిధ సమస్యలను డిమాండ్లను నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ నేతృత్వంలో పరిష్కారం దిశగా అడుగులు ముందుకు పడతాయని పలువురు లెక్చరర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పెబ్బేటి మల్లికార్జున్ గతంలో కోడేరు జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు 300 మందికి మూడు సంవత్సరాలు దాతల సహాయంతో మధ్యాహ్న భోజనాన్ని కార్యక్రమాన్ని నిర్వహించి అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేత ఉత్తమ ప్రిన్సిపాల్ గా ప్రశంసలు అందుకున్నారు.

AlsoRead:మన్‌ కీ బాత్‌ కాదు, మౌన్‌ కీ బాత్‌ తెలియజేయాలి

 

ఈ సందర్భంగా డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున గారిని వివిధ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు సిబ్బంది ఘనంగా సన్మానించి సత్కరించారు. కల్వకోల్ గ్రామంలో కీర్తిశేషులు పెబ్బేటి మిద్దె బాలయ్యకు మూడో కుమారుడైన మల్లికార్జున్ చిన్న వయసులోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేయడం గర్వకారణం అని ఆ గ్రామానికి చెందిన రవిశంకర్ గౌడ్ ఆయన సేవలను కృషిని పట్టదులను ఈ సందర్భంగా కొనియాడి అభినందించారు. రాబోయే రోజుల్లో భావితరాలకు బాసటగా నిలవాలని పేద ,బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకునే మంచి మనస్తత్వం గల పెబ్బేటి మల్లికార్జున్ పేద విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ వ్యవస్థ బలోపేతానికి,నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.జిల్లా గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెబ్బేటి మల్లికార్జున్ ను కల్వకోల్ గ్రామంలో పలువురు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube