ఢిల్లీ-ముంబై ఎలక్ట్రిక్ హైవే : నితిన్ గట్కరీ

ఢిల్లీ-ముంబై ఎలక్ట్రిక్ హైవే : నితిన్ గట్కరీ

1
TMedia (Telugu News) :

ఢిల్లీ-ముంబై ఎలక్ట్రిక్ హైవే : నితిన్ గట్కరీ

టి మీడియా,జూలై 13 న్యూఢిల్లీ : ఢిల్లీ-ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇక… కాలుష్యాన్ని అరికట్టేందుకు భారీ వాహనాల యజమానులు ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాలని ఆయన కోరారు. హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో గట్కరీ మాట్లాడుతూ… ‘ప్రభుత్వం రూ. 2.5 లక్షల కోట్లతో సొరంగాలను నిర్మిస్తోంది’ అని వెల్లడించారు.

 

Also Read : ఖైదీ ఇన్‌స్పెక్టర్‌కు హై సెక్యూరిటీ, ఐసొలేటెడ్‌ సెల్‌

-ఎలక్ట్రిక్ హైవే అనేది సాధారణంగా ఓవర్ హెడ్ పవర్ లైన్ల సహా దానిపై ప్రయాణించే వాహనాలకు విద్యుత్తు సరఫరా చేసే రహదారితో కూడుకుని ఉంటుంది. అన్ని జిల్లాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయాలన్నది మంత్రిత్వ శాఖ నిర్ణయమని తెలిపారు. కాలుష్య సమస్య అత్యంత తీవ్రరూపం దాల్చిన ప్రస్తుత తరుణంలో… ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని గట్కరీ కోరారు. ఇదిలా ఉంటే… రాష్ట్ర ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో… అవినీతి కారణంగా భారీ వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అంగీకరించారు. ఈ క్రమంలో.లు అందించే అన్ని సేవలను డిజిటలైజ్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికాలతో పోలిస్తే భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉందని గడ్కరీ వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube