కేంద్ర మంత్రివి అడ్డగోలు అబద్ధాలు

పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

0
TMedia (Telugu News) :

కేంద్ర మంత్రివి అడ్డగోలు అబద్ధాలు

-దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా

-ధరల పెంపుపై సర్కారుతో సమరమే*

*పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)లో సీఎల్పీ నేత బట్టి విక్రమార్క
టీ మీడియా, మార్చ్ 29, చింతకాని: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ తరువాత కేంద్రంతో యుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం చింతకాని మండలం నేరడ, గంగమ్మ దేవాలయం, కోమట్లగూడెం, నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సిపిఐ తెలుగుదేశం కార్యకర్తలు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Also Read : ఆల్‌టైమ్‌ విద్యుత్‌ డిమాండ్‌

కేంద్ర ప్రభుత్వమెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల పై పడిందని అన్నారుసామాన్యులు, పేదలు మూడు పూటలా తిండి తినే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలను పెంచి ప్రజల పై తీరని భారం మోపిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రతి ఊరిలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని వివరించారు.
కన్నీటి పర్యంతమైన కూలీలు
ప్రజా సమస్యల పరిష్కారంపై *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) మంగళవారంచింతకాని మండలం నేరడ నుంచి కోమట్లగూడెం గ్రామానికి వెళ్తుండగా నేరడ శివారులో వ్యవసాయ కూలీలు మండుటెండలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న దృశ్యాన్ని చూసి పొలం గట్ల వెంట నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. వ్యవసాయ కూలీల సమస్యలు వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నేరేడకు చెందిన రసూల్ బి తన గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటిపర్యంతమై విలపించింది. తన బిడ్డకు క్యాన్సర్ వస్తే చికిత్స చేయించడానికి 5లక్షల అప్పు చేశానని, అయినా తన బిడ్డ బతకలేదని బోరున విలపించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube