లక్ష్మీదేవి పేటను మండలం గా ప్రకటించాల్సిందే

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్

1
TMedia (Telugu News) :

లక్ష్మీదేవి పేటను మండలం గా ప్రకటించాల్సిందే

– జేఏసీ నాయకులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలి

బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్

టీ మీడియా, ఆగస్టు 3, ములుగు జిల్లా బ్యూరో:

అన్ని అర్హతలు ఉన్న లక్ష్మీదేవి పేట గ్రామాన్ని మండలం గా ప్రకటించాల్సిందేనని బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున లక్ష్మీదేవి పేటలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి నూతన మండలానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడారు. నూతన మండలం గా ఏర్పాటు అయ్యేందుకు కావలసిన గ్రామపంచాయతీలు ,ఎంపీటీసీ సభ్యుల తీర్మానాలను ప్రభుత్వానికి ప్రణాళిక బద్ధంగా అందించేందుకు జేఏసీ నాయకులు అందరిని కలుపుకుని ముందుకు సాగాలన్నారు. ములుగు పరిధిలో మల్లంపల్లి మండలాన్ని ప్రకటించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. లక్ష్మీదేవి పేట ప్రజల గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న మండలం సాధించుకోవాలనే కలను నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది బిజెపి పాలనేనని అప్పుడు కచ్చితంగా ప్రజల అభీష్టానికి అనుగుణంగా ములుగు జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేసేలా బిజెపి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

 

Also Read : ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

 

కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకుడు కారు పోతుల యాదగిరి గౌడ్ ,యువ మోర్చా మండల అధ్యక్షుడు గంగుల రాజ్ కుమార్ ,గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ధరమ్ సింగ్, నాయకులు తంగళ్ళపల్లి శ్రీధర్, తక్కల్లపల్లి సుమన్ రావు ,రాజు, సంతోష్, దేవేందర్, శరత్ ,సోనా సింగ్, మహేష్, సతీష్ ,జేఏసీ నాయకులు అంతటి రాము, ముడిగే రాజ్ కుమార్, తండ రమేష్ ,నగేష్ ,గట్టు కుమారస్వామి ,రవి , కారుపోతుల దేవేందర్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube