గోదావరి ఒడ్డుకు కరకట్ట నిర్మించాలనీ  

- రైతు సంఘం మండల కమిటీ డిమాండ్

0
TMedia (Telugu News) :

గోదావరి ఒడ్డుకు కరకట్ట నిర్మించాలనీ  

– రైతు సంఘం మండల కమిటీ డిమాండ్

 

టి మీడియా, అక్టోబర్ 25, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రైతు సంఘం మండల కమిటీ సమావేశం నిర్వహించారు . ఈ యొక్క సమావేశానికి ములుగు జిల్లా అధ్యక్షుడు చిట్టెం ఆదినారాయణ హాజరై వారు మాట్లాడుతూ ఈ మండలంలో గోదావరి ముంపు కు చాలా భూములు రైతులు కోల్పోయారని, అంతే కాకుండా ఉన్న భూముల్లో ఇసుక మేటలు వేశాయని అన్నారు, ఈ యొక్క సమస్యకు పరిష్కారం గా “వాడగూడెం నుంచి పాత్రా పురం గ్రామం వరకు గోదావరి ఒడ్డున కరకట్ట నిర్మించాలని రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మండలంలో వ్యవసాయ శాఖ అధికారిని నియమించాలని కోరారు.

Also Read : చేనేత కార్మికుల పై జిఎస్టీ ఎత్తి వేయాలి

మండలంలో చాలా మంది ఎరువులు, పురుగు మందుల షాపుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేసేవిధంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చొరవ చూపి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 3వ తేదీన ములుగు లో జరిగే రైతు సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తోట నాగేశ్వరరావు, కార్యదర్శి కంటెం సత్యం, మండల నాయకులు విజయ్ కుమార్, సాంబశివ, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube