మృతికి రెయిన్బో పాఠశాల యాజమాన్యమే కారణం

ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం డిమాండ్

1
TMedia (Telugu News) :

మృతి కి రెయిన్బో పాఠశాల యాజమాన్యమే కారణం

అమూల్య కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా పాఠశాల యాజమాన్యమే చెల్లించాలి

ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం డిమాండ్

టీ మీడియా,ఆగస్ట్ 8,గోదావరిఖని : గోదావరిఖని మార్కెండేయ కాలనీలో ఉన్న రెయిన్బో పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఎల్కలపెల్లి గేట్ కు చెందిన విద్యార్థిని తన్నీరు అమూల్య సోమవారం ఇంటి నుంచి స్కూలు కు పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన టాటా ఏసి వాహనం లో వస్తుండగా వాహానం కండీషన్ సరిగా లేకపోవడం వల్ల వాహనం నుండి కింద పడి ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయని, హాస్పిటల్ కు తీసుకు వెళుతుండగా అమూల్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం అన్నారు. అమూల్య మృతి కి రెయిన్బో పాఠశాల యాజమాన్యమే కారణమని ఆయన అన్నారు.అమూల్య మృతి కి కారణమైన రెయిన్బో పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు.

 

Also Read : కేంద్రం ఏం చేసింది కేసీఆర్ ఏం చేశాడో తేలుస్తాం

 

పాఠశాల యాజమాన్యమే అమూల్య మృతి కి బాధ్యత వహించి వారి కుటుంబానికి 50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ పాఠశాల వాహనాల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమూల్య మృతి పట్ల ఏఐఎస్ఎఫ్ నగర సమితి సంతాపం వ్యక్తం చేస్తుందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం,సంబంధిత విద్యా శాఖా అధికారులు స్పందించి పాఠశాలలో ఉన్న వాహానాలను పరీశీలించి విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా,సౌకర్యం గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎలుక పల్లి సురేష్,గాజుల అవినాష్,ఇరుగురాల సూర్య,ఎన్ ఎస్ యు ఐ నాయకులు దుర్గా,విజయ్, ఉదయ్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube