పార్లమెంట్ సమావేశంలో బిల్లును ఏర్పాటు చేయాలి

అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్

1
TMedia (Telugu News) :

పార్లమెంట్ సమావేశంలో బిల్లును ఏర్పాటు చేయాలి

-అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్

టీ మీడియా, ఆగస్టు 5, వనపర్తి బ్యూరో : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సమావేశంలోని చట్టబద్ధత కల్పించాలని వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక.ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్,కో కన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షుడు వెంకటేష్, సాటిపి సతీష్, అడ్వకేట్ ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ దశాబ్దాలుగా మంద కృష్ణ మాదిగ చేపట్టిన వర్గీకరణ బిల్లుపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా మద్దతు తెలుపగా కొన్ని ప్రభుత్వాలు ఇన్ డైరెక్ట్ గా మద్దతు తెలిపాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు పెడ చేవిన పెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇంటర్నెట్ కేంద్రం ఇప్పుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు అమొద ముద్ర వేసి చట్టబద్ధత కల్పించాలని అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Also Read : వైభవంగా వజ్రోత్సవ వేడుకలు

కానియెడల ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట అఖిలపక్ష ఐక్యవేదిక నడుస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుందని సతీష్ యాదవ్ చెప్పారు. దీక్షలో పాల్గొన్న సభ్యులు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజనగరం రాజేష్, గంధం నాగరాజు, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ, ఎంమార్పిఎస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు చెన్నకేశవులు లకు పూలదండ వేసి దీక్షను ప్రారంభించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube