ఆశా వర్కర్ల డిమాండ్లను బడ్జెట్ సమావేశంలో పరిష్కరించాలి

ఆశా వర్కర్ల డిమాండ్లను బడ్జెట్ సమావేశంలో పరిష్కరించాలి

0
TMedia (Telugu News) :

ఆశా వర్కర్ల డిమాండ్లను బడ్జెట్ సమావేశంలో పరిష్కరించాలి

టీ మీడియా, ఫిబ్రవరి 2, తిరుమలాయపాలెం మండలం : తిరుమలయపాలెం మండలం నుండి పాలేరు ఎమ్మెల్యే కందాళ్ళ ఉపేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు. పాలేరు నియోజకవర్గ ఆశా వర్కర్లు అందరూ కలిసి ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని ఆశా వర్కర్లను కూడా గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా చూడాలని ప్రతి నెల జీతాలు సకాలంలో అందించాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు నకిరే కంటి నాగలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాలలో సమయానుకూలంగా ప్రజలకు వైద్య సేవలలో పాల్గొంటున్నామని కరోనా సమయములో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి కరోనా మహమ్మారికి భయపడకుండా ఆశా వర్కర్లమే సేవ చేశామని గుర్తు చేశారు. ఆశా వర్కర్లలో కొంతమంది ఏఎన్ఎంలుగా ట్రైనింగ్ అయిన వారు ఉన్నారు వారిని. గుర్తించి ఏఎన్ఎంలుగా ఉద్యోగాలలోకి తీసుకోవాలని ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని ప్రతి నెల నెల జీతాలు సకాలంలో అందేలా చూడాలని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో

Also Read : ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా సుప్రీంక్టోర్టులో పిటిషన్‌

మాకు కూడా అలాంటి సౌకర్యాలు అందేటట్లుగా చూడాలని మా యొక్క డిమాండ్లు తక్షణమే ఈ బడ్జెట్ సమావేశంలోనే అమలు పరిచే విధంగా గవర్నమెంట్ మాకు తగు న్యాయం చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే కందాళ్ళ ఉపేందర్ రెడ్డి ఈ బడ్జెట్ సమావేశంలోనే ఆశా వర్కర్ల గురించి మాట్లాడి మా యొక్క డిమాండ్లను తక్షణమే అమలయ్యే విధంగా చూడాలని వారికి. వినతిపత్రం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిహెచ్. నరసమ్మ ఎల్ లక్ష్మీ పడిశాల కరుణ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube