వాల్మీకుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కరించాలి
– రావుల చంద్రశేఖర్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 20 , వనపర్తి బ్యూరో : వాల్మీకులను ఎస్టిలలో చేరుస్తూనే ఇతర కులాలకు రిజర్వేషన్లకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చెల్లప్ప కమిషన్ సిఫార్సుల అమలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకోవాలి జిల్లా కేంద్రములో వాల్మీకి సోదరులు ప్రభుత్వం ఇచ్చిన హామిమేరకు ఎస్టి జాబితాలోకి చేర్చాలని 11వరోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే టిడిపి పొలిటి బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఉమ్మడి రాష్టం నుండి వాల్మీకి సోదరులు ఎస్టి జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.కెసిఆర్ ఉద్యమములోను, ప్రభుత్వంలో కూడా ఈ హామీ ఇచ్చారని వారి మాట నిలుపుకొని వెనుకబడిన వాల్మీకీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
అదే సమయములో ఎస్టి జాబితాలో కొనసాగుతున్న లంబాడీ,ఎరుకల, చెంచు, కొయ్యా,తదితర కులాలకు నష్టం జరగకుండానే వాల్మీకుల జనాభా నిష్పత్తి ప్రకారం వారిని ఎస్. టి జాబితాలో చేర్చాలని అన్నారు.వాల్మీకుల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.రావుల వెంట అచుతారామారారువు, వెంకటయ్య యాదవ్,నందిమల్ల.రమేష్,జమీల్,కొత్త.గొల్ల.శంకర్,బాలు నాయుడు,అనిల్ వున్నారు.పట్టణములో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాబర్ గృహానికి వెళ్లి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సబిరెడ్డి.వెంకటరెడ్డి మాతృమూర్తి ఇటీవల మరణించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నారాయణ రెడ్డి మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube