ప్రజాస్వామ్యం ఎంతో గొప్పది

-సంస్కృతి ,సాంప్రదాయంలు విశిష్టమైనవి

1
TMedia (Telugu News) :

ప్రజాస్వామ్యం ఎంతో గొప్పది
-సంస్కృతి ,సాంప్రదాయంలు విశిష్టమైనవి
-వీడ్కోలు ప్రసంగం లోరామ్‌నాథ్‌ కోవింద్‌
టి మీడియా,జూలై25,దిల్లీ: భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. నేటితో తన పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్ఠమైనని.. వాటిని యువతరం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తాను సాధారణ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని పొందడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యూపీలోని పరౌంఖ్‌ గ్రామానికి చెందిన కోవింద్‌ ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే.. అందుకు కారణం ప్రజాస్వామ్య సంస్థల స్వాభావిక శక్తేనన్నారు. యువతరం తమ గ్రామం/పట్టణంతో, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుసంధానం కలిగి ఉండే సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

 

Also Read : టి మీడియా అధ్వర్యంలో గోరింటాకు వేడుక

రాష్ట్రపతిగా తాను పదవిలో ఉండగా తన ఇంటికి వెళ్లి కాన్పూర్‌లోని తన ఉపాధ్యాయుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలన్నారు. 19వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు జరిగాయని.. కొత్త ఉషోదయంపై ఆశలు కలిగించిన ఎంతోమంది హీరోల పేర్లు మరిచిపోయి చాలా కాలమైన నేపథ్యంలో ఇటీవల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ నేపథ్యంలో వారి చారిత్రక కథలను గుర్తుచేసుకుంటున్నామన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనగడ సాగించలేదని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వసించారన్నారు. 21వ శతాబ్దాన్ని భారత దేశ శతాబ్దంగా మార్చుకొనేందుకు మన దేశం సన్నద్ధమవుతోందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. తన ఐదేళ్ల పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వర్తించినట్టు వెల్లడించారు. వాతావరణంలో మార్పులతో నెలకొన్న సంక్షోభం భూగోళం భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. భావితరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని కాపాడుకోవాలని సూచించారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
దిల్లీ: భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. నేటితో తన పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో విశిష్ఠమైనని.. వాటిని యువతరం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తాను సాధారణ పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఒక సామాన్యుడు అత్యున్నత పదవిని పొందడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యూపీలోని పరౌంఖ్‌ గ్రామానికి చెందిన కోవింద్‌ ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే.. అందుకు కారణం ప్రజాస్వామ్య సంస్థల స్వాభావిక శక్తేనన్నారు. యువతరం తమ గ్రామం/పట్టణంతో, పాఠశాలలు, ఉపాధ్యాయులతో అనుసంధానం కలిగి ఉండే సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

 

Also Read : విద్యార్థినికి అభినందించిన మంత్రి కొప్పుల

రాష్ట్రపతిగా తాను పదవిలో ఉండగా తన ఇంటికి వెళ్లి కాన్పూర్‌లోని తన ఉపాధ్యాయుల పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం తన జీవితంలో మరిచిపోలేని క్షణాలన్నారు. 19వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు జరిగాయని.. కొత్త ఉషోదయంపై ఆశలు కలిగించిన ఎంతోమంది హీరోల పేర్లు మరిచిపోయి చాలా కాలమైన నేపథ్యంలో ఇటీవల ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ నేపథ్యంలో వారి చారిత్రక కథలను గుర్తుచేసుకుంటున్నామన్నారు. సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం మనగడ సాగించలేదని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వసించారన్నారు. 21వ శతాబ్దాన్ని భారత దేశ శతాబ్దంగా మార్చుకొనేందుకు మన దేశం సన్నద్ధమవుతోందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. తన ఐదేళ్ల పదవీకాలంలో శక్తిమేరకు బాధ్యతలు నిర్వర్తించినట్టు వెల్లడించారు. వాతావరణంలో మార్పులతో నెలకొన్న సంక్షోభం భూగోళం భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. భావితరాల కోసం పర్యావరణం, భూమి, గాలి, నీటిని కాపాడుకోవాలని సూచించారు. దేశ ప్రజలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube