డీఈవో,ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలి

రేణుకుంట్ల ప్రీతం

0
TMedia (Telugu News) :

డీఈవో,ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలి

– రేణుకుంట్ల ప్రీతం

టి మీడియా, జనవరి 19, గోదావరిఖని : గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రశాంత్ నగర్ లో సీబీఎస్ఈ అనుమతులు లేని రావూస్ స్కూల్ పై, చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి, తెలియజేసి,నెలలు గడుస్తున్న చర్యలు తీసుకోలేని డీఈవో, ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం గురువారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ…రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి అసలు సీబీఎస్ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారని,ఇస్తే ఏ విధంగా ఇచ్చారని,ఏ నిబంధనల ప్రకారం రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి సీబీఎస్ఈ పర్మిషన్ ఉందని ఫ్లెక్సీ హోర్డింగల మీద ఫ్లెక్సీలు వేశారని,ఆటోల మీద స్టిక్కర్లు అంటించారని,జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఒక్క భవనంలో రెండు పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయని డీఈవో, ఎంఈఓ లను ఆయన సూటిగా ప్రశ్నించారు.

Also Read : పోలీస్ అభ్యర్థులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి

సీబీఎస్ఈ,అనుమతులు లేని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా,మండల విద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటని,నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుమతులను రద్దు చేయాలని,లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తూన్న,విద్యార్థులను, తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ చేస్తున్న రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కీర్తి నరేంద్ర,గుడిసెల ప్రణీత్, అరవింద్ వంశీ,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube