తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సిఎం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సిఎం

0
TMedia (Telugu News) :

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సిఎం

– భట్టి విక్రమార్క

టీ మీడియా, డిసెంబర్ 12, తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పుతో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. తాను నిర్వర్తించే ఆర్థిక శాఖ, విద్యుత్‌ శాఖలో ఆర్థికలో ఉన్న అన్ని ఆటంకాలు అని తొలగిపోయి రాష్ట్ర అభివృద్ధికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించానని తెలిపారు. మంగళవారం 28న నిర్వహించే అఖిల భారతీయ కాంగ్రెస్‌ సమావేశంలో పలు సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామన్నారు. కుటుంబానికి పనికి వచ్చే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Also Read : హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube