డిప్యూటీ డి.యం అండ్ హెచ్ డాక్టర్ నరేష్ కు నివాళి
రెండు రోజుల క్రితం కరోనా కు బలి అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భద్రాచలం డిప్యూటీ డి.యం అండ్ హెచ్.ఒ డాక్టర్ నరేష్ కు శనివారం అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాల ఉద్యోగులు,సిబ్బంది శనివారం వినాయకపురంలో నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. అలపెరుగని కరోనా వ్యాప్తి నివారణ పై పోరాటం చేసిన వైద్య యోదుడు డా.నరేష్ అని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు.ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్దాంజలి ఘటించారు. మౌనం పాటించి నివాళులు అర్పించారు.