హెల్త్ క్యాంపులు నిర్వహించి-రక్త నమూనాలను సేకరించండి

0
TMedia (Telugu News) :

-డిప్యూటీ డీఎంహెచ్ఓ,జిల్లా మలేరియా అధికారి వీరబాబు

టీ మీడియా,డిసెంబర్ 23, కరకగూడెం:

వివిధ గ్రామాల్లో,వసతి గృహాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి జ్వరాలతో బాధపడేవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ,జిల్లా మలేరియా అధికారి వీరబాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు.
గురువారం మండల కేంద్రంలోని పీహెచ్ సీని ఆకస్మికంగా సందర్శించి ల్యాబ్, ఫార్మసీ రికార్డ్సులను పరిశీలించారు.
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.మలేరియా హైరిస్క్ గ్రామాల్లోకి సామూహిక రక్తపూతలు సేకరించాలన్నారు.అంతేకాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసి ఆరోగ్యంపై వారిని చైతన్యం చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి పర్షియా నాయక్, ఏఎంఓ గొంది వెంకటేశ్వర్లు, ఎస్యుఓ లింగ్యా నాయక్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Deputy DMHO and district malaria officer Veerababu directed the medical staff to conduct health camps .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube