జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తహసీల్దార్

జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తహసీల్దార్

3
TMedia (Telugu News) :

జ్ఞాపికను అందజేసిన డిప్యూటీ తహసీల్దార్

టీ మీడియా, మే 25, వనపర్తి బ్యూరో : హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కి జ్ఞాపికను శ్రీరంగాపురం మండల డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ అందజేశారు. ఆయన ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన రోజు ఆయన సతీమణితో కలిసి దిగిన ఫోటోను ఈ సందర్బంగా పెయింటింగ్ వేసిన శ్రీరంగాపూర్ డిప్యూటీ తాసిల్దారు శివకుమార్ అనేక రోజులు శ్రమించి ఆయన స్వహస్తాలతో ఈ పెయింటింగ్ వేయడం జరిగింది.

Also Read : ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్

ఈ జ్ఞాపికను అందించేందుకు అప్పోయింట్మెంట్ కోరగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ లోని తన నివాసానికి రావలసిందిగా తెలియజేయడంతో అక్కడికి వెళ్లి జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శివ కుమార్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి బి టీవీ సీఈవో డాక్టర్ మురహరి, బుద్ధారం సెక్యూరిటీ ఎసిపి త్రిలోకనాథ్ రెడ్డి, చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జ్ఞాపికను అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి డీటీ శివ కుమార్ ప్రత్యేక దన్యవాదములు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube