పట్టాలు తప్పిన గూడ్స్‌.. రైలు 2 గంటలు ఆలస్యం

పట్టాలు తప్పిన గూడ్స్‌.. రైలు 2 గంటలు ఆలస్యం

1
TMedia (Telugu News) :

పట్టాలు తప్పిన గూడ్స్‌.. రైలు 2 గంటలు ఆలస్యం

టి మీడియా నవంబరు 9, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పై హుటాహుటిన మరమ్ములు చేస్తున్నారు.

Also Read : సీజేఐగా ప్ర‌మాణం చేసిన జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌

కాగా, గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణమధ్య రైల్వే తొమ్మి రైళ్లను రద్దు చేసింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దుచేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని అధికారులు తెలిపారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-విజయవాడ, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లను రద్దుచేసినట్లు చెప్పారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube