తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా

పోలింగ్ కేంద్రాలు ఎన్నిఅంటే.

0
TMedia (Telugu News) :

తెలంగాణలో ఓటర్ల వివరాలు ఇలా..

-పోలింగ్ కేంద్రాలు ఎన్నిఅంటే..

టీ మీడియా, అక్టోబర్ 9,హైదరాబాద్‌ :ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, రాజస్థాన్ లో నవంబర్ 23న అదేవిధంగా
మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించామని, వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

Also Read : కేసీఆర్ హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయం

ఓటర్ల వివరాలు ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3.17 కోట్ల ఓటర్లున్నారని సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. వీరిలో పురుషులు 1.58 కోట్లు మంది కాగా, స్త్రీ ఓటర్లు 1.58 కోట్లు మంది. 18- 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన కొత్త ఓట్లు 8.11 లక్షల మంది ఉన్నట్లు సీఈసీ చీఫ్ తెలిపారు. దివ్యాంగులు 5.06 లక్షలు మంది, 80ఏళ్లు వయస్సు పైబడిన వారు 4.4లక్షలు మంది ఉన్నారు. వందేళ్లు వయసు దాటిన ఓటర్లు 7005 మంది ఉన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్ కాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,798. అదేవిధంగా మహిళా పోలింగ్ కేంద్రాలు 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644. దివ్యాంగ కేంద్రాలు 120 ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. మొత్తం 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది..

Also Read : శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై తీర్పు వాయిదా

-పోలింగ్ కేంద్రాలు ఎన్నిఅంటే..

టీ మీడియా, అక్టోబర్ 9,హైదరాబాద్‌ :ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, రాజస్థాన్ లో నవంబర్ 23న అదేవిధంగా
మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. చత్తీస్ గఢ్ లో రెండు విడతల్లో నవంబర్ 7, 17 తేదీల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. నోటిఫికేషన్ విడుదల సందర్భంగా సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 40 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో పర్యటించామని, వీటిల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube