టీ మీడియా డిసెంబర్ 14 దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మంగళవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్నచింతకుంట మండల ప్రజల చిరకాల కోరిక చిన్నచింతకుంట మండలం నుండి శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం వరకు రోడ్డు బ్రిడ్జి చెక్ డ్యామ్ కోసం 30 కోట్లు మరియు కురుమూర్తి దేవస్థానం గుట్ట కింద నుంచి స్వామి వరకు 11 కోట్లు మొత్తం 40 కోట్లు జీవో చాలా రోజుల క్రితమే తీసుకురావడం జరిగింది. కానీ గత రెండు సంవత్సరాల నుంచి కరోన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక టెండర్లు పిలవలేని పరిస్థితి ఉంది. మొన్ననే కేసీఆర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. మరో పదిహేను రోజుల్లో మంచి రోజులు చూసుకొని జిల్లా మంత్రులు మరియు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భూమి పూజ కార్యక్రమం కూడా జరుపుకోబోతున్నాం దేవరకద్ర నియోజకవర్గంలో రెండు లిఫ్టులు గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం 1 పేరూరు లిఫ్ట్ లిఫ్ట్ కింద పేరూరు వెంకంపల్లి దాసరపల్లి అమ్మాపూర్ 6 గ్రామాలకు సంబంధించి రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగు నీరు రాక కోసం 51 కోట్ల మంజూరు చేయడం జరిగింది.
టెండర్లు కూడా పూర్తయ్యాయి ఇది కూడా 15 రోజులలో ప్రారంభించబోతున్న కనిమెట్ట పాత జంగమయ్యపల్లి బ్రిడ్జి కోసం 12 కోట్ల 40 లక్షలతో కొత్తగా మంజూరు చేసుకున్న దీనిని కూడా త్వరలోనే మంత్రుల సమక్షంలో ప్రారంభించబోతున్న ఈ మూడు పనులకు సంబంధించి 104. 40 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. టెండర్లు పూర్తి అయినది కాబట్టి ప్రజలకు తెలియాలని ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మో త్వరలోనే ఈ మూడు పనులను భూమి పూజలు చేసుకొని మంత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.