ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దాం

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దాం

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దాం

టి మీడియా, జూన్ 16,వనపర్తి బ్యూరో : పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామం సర్పంచ్ సరిత తిరుపతి రెడ్డి
బుధవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనిగిళ్ల మరియు ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలను చేర్చాలని, పాఠశాలల బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు.

Also Read : ప్రజల అజెండాను ముందుకు తీసుకువచ్చే “జనం కోసం సిపిఎం”

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పాఠశాల లోని సిబ్బంది సమస్య ను, స్కావెంజర్ సమస్యను చర్చించారు. ఈ కార్యక్రమంలో SMC చైర్మన్ పద్మ, ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్, PS HM జ్యోతి, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube