వైరా అభివృద్ధిలో

ఎంఎల్ఏ రాములు నాయక్ను ముందుకు నడిపిస్తాం

1
TMedia (Telugu News) :

వైరా అభివృద్ధిలో

ఎంఎల్ఏ రాములు నాయక్ను ముందుకు నడిపిస్తాం
-పార్టీ ఇల్లులాంటిది ఇంటికి నిప్పు పెట్టుకోవద్ద
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
టిమీడియా ఏప్రిల్ 5 జూలూరుపాడు: వైరా నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కు అన్ని విధాల అండగా ఉండి, అభివృద్ధిలో ముందు ఉంచుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జూలూరుపాడు లో ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్ సై డ్రైనేజ్ పనులకు 5 కోట్ల 22 లక్షల రూపాయల వ్యయంతో, శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, వైరా ఎమ్మెల్యే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని, మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నందున, ఆయనకు మంత్రిగా తాను ఎమ్మెల్సీ తాతా మధులు అండగా ఉండి, రాములు నాయక్ నాయకత్వం లో వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రజలకు వాగ్దానం చేశారు.

Also Read : ఈ ఐ-ఫోన్ల‌పై మెగా డిస్కౌంట్లు..

పార్టీ అనేది ఏ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఆశ్రయం కల్పించే ఇల్లు లాంటిదని, పార్టీలో ఉన్న వారు ఎవరైనా సరే ఇంటికి నిప్పు పెట్టుకునే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. గత పాలకుల హయాంలో వైరా నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉందని కానీ ప్రస్తుతం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. జూలూరుపాడు లో తాను గతంలో పర్యటించినప్పుడు స్థానిక నాయకులు ఎల్లంకి సత్యనారాయణ వద్ద ఆగినప్పుడు జూలూరుపాడు అభివృద్ధి గురించి ప్రస్తావన తెచ్చారని, అనంతరం ఎమ్మెల్యే రాములు నాయక్ జూలూరుపాడు అభివృద్ధి విషయమై తనను అనుక్షణం వెంటాడే వారని ఆయన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube