అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

0
TMedia (Telugu News) :

అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి తలసాని

టీ మీడియా, నవంబర్ 22, హైదరాబాద్‌ : అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్‌పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి వచ్చే పొలిటికల్ టూరిస్ట్ లతో కలిగే ప్రయోజనం శూన్యమని స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పాలనను అందిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బలపర్చాలని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను అడుగుతున్నది. వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

Also Read : రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube