అభివృద్ధి గాముకుడు రాం సహాయం

అభివృద్ధి గాముకుడు రాం సహాయం

0
TMedia (Telugu News) :

నా జ్ఞాపకాలు

అభివృద్ధి గాముకుడు రాం సహాయం
—-
పాలేరు అంటేనే పేరు లోనే పరులు కోసం పని చేసే వారు అనే అర్థం కూడా వస్తుంది.ఆ ప్రాంతం అత్యధిక కాలం రెడ్డి రాజులు పాలన లోనే సాగింది.వారు చెప్పిందే శాసనం గా జనం అవలబించే వారు. ఒక్క మాట లో చెప్పాలి అంటే వారు నిర్ణయం చేసిందే పెళ్లి ముహూర్తం గా ఉండే ది. ఆ పాలన కాస్త నియంత పాల న గా మారింది.దొర ల పెత్తనం వరకు వెళ్ళింది.ఆ పెత్తనం చేసే కుటుంబాల లోనే వెలసింది ఓక ప్రజా కుసుమం.పుట్టింది భూస్వామ్య కుటుంబం లో అయిన..ప్రక్కనే ఉన్న నాటి నల్గొండ జిల్లా లోని వామ పక్ష వాధు లు గా నాడే ఉన్న బందు ,మిత్రుల నుండి ఆ భావజాలం పుణికి పుచ్చుకున్న రు..మల్లు ను, మల్లు తోనే తీయాలి అను కొన్నరేమో..దొర అని పిలిపించి కుంటునే ప్రజా సంక్షేమం కోసం జీవిత కాలం పని చేశారు.
ఆయనే అమరులు, మాజీ ఎంపిపి ,పాలేరు నాటి దొర (దొరగారు కాదు)వారు(ఓకప్పటి దొర) రాం సహాయం బుజంగ రెడ్డి గారు..

నాడు ఏమి జరిగింది
—-
నాడు పాలేరు గ్రామంలో బుజంగ రెడ్డి గారు, చేగొమ్మా లో రాం సహాయం సురేందర్ రెడ్డి దొర, నేటి తిరుమలాయ పాలెం మండలం సబ్లెడ్ ప్రాంతం లో రాం సహాయం భోను సుందర్ రెడ్డి దొర ఈ విధంగా తమ పెత్తనం గ్రామాలు పై కొన సాగించారు. ప్రజల్లో వచ్చిన చైతన్యం ,ఇబ్బంది తో సురేందర్ రెడ్డి గారు బంగ్లా కు, అర్విందరెడ్డి గారు కుటుంబాలు ఖమ్మం కు నివాసాలు మారాయి. వీరి ద్దరి నివాసాలు ఖమ్మం లో వేర్వేరు ప్రాంతాలు లో నేటికీ ఉన్నయి..పాలేరు లో ఉన్న బుజంగ రెడ్డి గారు కు టుబం మాత్రం పాలేరు లో స్థిర నివాసం నేటికీ అదే స్థలం లో ఉంది..కారణం అందరూ నేటికీ కాంగ్రెస్ లోనే ఉన్న పాలేరు లో వారికున్న ప్రజా మద్దతు, ఆదరణ కదలకుండా చేసింది.అందరూ వెళ్లి పోవడం తో మొత్తం పాలేరు నియోజిక వర్గం కు బజంగ రెడ్డి గారు ఏకైక పెద్ద దిక్కు అయ్యారు.

ఇంటిఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టో 

ఎస్సీ,ఎస్టీ,బిసి ల కుటుంబాలు తో అయన కు ఉన్న అనుబంధం బలం గా మారటం కూడా ఇక్కడే ఉండే టట్లు చేసింది.. కదల కుండా కట్టి పడవేసింది అంటారు పెద్దలు..వామ పక్ష భావాజలం కలిగిన కాంగ్రెస్ వాధి కూడా అయిన అయన , ఓక దశలో వామ పక్ష పార్టీ లు ముఖ్యంగా సిపిఎం తో ఎదురు పడి పోరాటం చేశారు ఆ క్రమంలో 1984 లో అయన పై హత్య యత్నం జరిగింది .అయిన అప్పటి కే ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా అపాయింట్ మెంట్ కూడా లేకుండా మాట్లడే సత్తా, అధికార యంత్రాంగం ను శాసించే స్థాయి ఉన్న అయన ..తన పైదాడి విషయం లో తీవ్ర చర్యలకు పోలేదు.ఫైరవీలు చెయ్య లేదు.తన ప్రాంత ప్రజలు నే తప్పు వారే తెలుసు కొంటారు అన్నారు..అన్నట్లు గానే ఆనాటి దాడికి ప్రధాన సూత్ర దారులు ,పాత్ర దారు ల్లో కొంత మంది కాంగ్రెస్ లో చేరారు. అయనను,అయన కుటుంబ సభ్యులుకి నేటికీ జనం అదరించాడానికి పెద్దలు చెప్పే కర్ణుడు చావుకు ఉన్నట్లు గా సవాలక్ష కారణాలు ఉన్నయి.. అవి కూడా మరో ఏపి సోడ్ లో నాకు తెలిసిన,నేను సేకరించిన వివరాలు తో తెలియ చేస్తాను.

మదన్ లాల్ పై మన్మధ ప్రచారం వెనుక భారి మతలభ్ ..?

ఇప్పుడే ఎందుకు ఈ స్టోరీ అంటే

ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ అని మిత్రులు కు ఆలోచన రావచ్చు .నేను నాడు,నేడు వామ పక్ష వాది నీ.అదే నావిధానం. భూస్వామ్య కుటుబం లో పుట్టిన నేను ఊహ తెలిసిన నాటి నుండి ఆ విధానం కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో.ముఖ్యంగా కాంగ్రెస్ విధానం కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం లో ఘోర నిర్భందం ఎదుర్కొన్న వ్యక్తిని..అయన కాంగ్రెస్ కండువా దగ్గర పెట్టుకొని , ఆ పార్టీలో ఉంటూ కూడా జనం కోసం తపించిన మా నాన్నా శనగపాటి దత్తాత్రేయ రావు గారి లాంటి వారు అనేక మంది ఉన్నారు అందులో బుజంగ రెడ్డి గారు ఓకరు.వీరు పేరుకే కాంగ్రెస్ ,దొర అని పిలిపించు కోవడం మాత్రమేవీరికి ఆనందం..(ఇది వామ పక్ష విధానం కు వ్యతిరేకం).దొర పెత్తనం చెయ్యరు. అలా పిలిచిన వారు అంత మావాళ్ళు అనుకొని వారి కోసం తమ కున్న పర్చయాలు,పలుకు బడి వినియోగించారు.. నిదర్శనం లు కూడా అనేకం ఉన్నయి..అనాడు వీరు ఉత్తరం రాసి ఇచ్చిన, నోటి మాట చెప్పిన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు..వీరి కు టుంబం లో ఎవరికి అయిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుంచు కొన్నారా..? వీరి పిల్ల ల ను ఆ నాడు అత్యున్నత స్థాయి వారికి ఇచ్చి పెళ్లి చేశారా..?అదృష్టం బాగుండి వారు సెటిల్ ఆయ్యారు.ఓక్క ఏకరం కొత్త గా కొన్నారా..?ఉన్న యకరాలు ఎన్ని పోయాయి..ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి.

 

ఇదే క్రమంలో ప్రస్థుత పాలేరు ఎమ్మెల్యే కంధాల ఉపేందర్ రెడ్డి గారు తండ్రి నర్సిరెడ్డి గారు లాంటి వారు పదవి లేక పోయినా ప్రజల కోసం,ముఖ్యంగా భుజంగ రెడ్డి గారి సాన్నిహిత్యం లో చేసిన కృషి మరిచి పోలేము..నర్సిరెడ్డి గారు బుజంగ రెడ్డి గారి సమకాలికులు కారు..అయిన అయన సాన్ని హిత్యం లో పని చేశారు.

(బజంగ రెడ్డి గారు జనం కోసం ఏమి చేశారు మరో కధనం లో)

ఇట్లు
శనగపాటి మురళి కృష్ణ
ఇండి పెండెంట్ జర్నలిస్ట్
ఖమ్మం జిల్లా, తెలంగాణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube