అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
టి మీడియా,జూలై26,జగిత్యాల ప్రతినిధి:
చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో కోటి రూపాయల నిధులతో అంబేద్కర్ సంఘ భవనం,మహిళా సంఘ భవనం, యాదవ సంఘ భవనం, రజక సంఘ భవనం,గౌడ సంఘ భవనం,కుమ్మరి సంఘ భవనం, విశ్వకర్మ సంఘ భవనం,వైకుంఠధామం,సిసి రోడ్లు,అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నా యని..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంద న్నారు.ఎవరు అడగకముందే కళ్యాణ లక్ష్మి, రైతుబంధు,రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు దేశంలోని ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మనిగతంలో రైతుల ఆత్మహత్యలు ఉంటుండే. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందోతెలియదు.ఎరువులు విత్తనాల కోసం లైన్లో వేచి ఉండే పరిస్థితి. చెప్పులను కూడా లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండేది.
Also Read : వసతి గృహంలో విజిలెన్స్ యస్పి తనిఖీలు
కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి.ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.అందులో భాగంగా కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనీ.ఎక్కడికక్కడ పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వ మనిఇప్పటివరకు రైతుబంధు ద్వారా 58 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందనీ.ఆసరా పెన్షన్ ల ద్వారా వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు, వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు 958 గురుకుల పాఠశాలలు స్థాపించి నిరుపేద బిడ్డలకు ప్రతి సంవత్సరానికి ఒక విద్యార్థి పై లక్ష ఇరవై వేలు రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమనిదళిత బంధు పథకం ద్వారా దళితుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నార న్నారుఈ కార్యక్రమంలో అధికారులు గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube