అభివృద్ధి పథంలో వనపర్తి ఎమ్మెల్యే

అభివృద్ధి పథంలో వనపర్తి ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

అభివృద్ధి పథంలో వనపర్తి ఎమ్మెల్యే

టీ మీడియా, జులై 15, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. 2001లో రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టిఆర్ఎస్ పార్టీలో చేరి మహబూబ్ నగర్లో దశాబ్దకాలం పాటు టీఆర్ఎస్ ను ఒంటిచేతితో నడిపించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా బతుకు చిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్ రెడ్డి గుర్తింపు పొందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 4291 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టిఎంసిలు ఉన్నా నీటి కేటాయింపును 40 టీఎంసీలకు పెంపుదల చేసి జీవో విడుదల అయ్యేలా కృషి చేశారు. 11 నెలలో ఖిల్లా ఘణపురం కాలువను 40 రోజులలో పెద్దమందడి కాల్వలు తవ్వించి సాగునీరు తీసుకువచ్చారు.

 

Also Read : పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాలు, దీక్ష‌లు, నిర‌స‌న‌లు నిషేధం

వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాత ఎన్నికల నామినేషన్ వేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, వనపర్తి, గోపాల్పేట, రేవెల్లి మండలాలు భీమా ద్వారా వనపర్తి లో కొంతభాగం శ్రీరంగాపురం మండలాలలో సస్యశ్యామలం అవుతున్నాయి. అంటే దానికి కారణం నిరంజన్ రెడ్డి 2018 ముందస్తు ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై 51,783 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 లో కెసిఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ సహకార పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించారు. ప్రధానంగా వనపర్తి జిల్లా సాధించడం, వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎన్ని చెరువులను నింపే కార్యక్రమం, 40 ఏళ్ల నుంచి కాని రోడ్డు వెడల్పు అందర్నీ ఒప్పించి చేస్తున్నా కార్యక్రమం వనపర్తి నడిబొడ్డున 19.50 కోట్లతో సమీకృత మార్కెట్ రెండు అంతస్తులతో 85 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. 50 వ్యాపార దుకాణాలు, 120 కూరగాయల దుకాణాలు, సూపర్ మార్కెట్, చిల్డ్రన్ పార్క్, 24 దుకాణాలు, పండ్ల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఎకో పార్క్ సమీపంలో 3 కోట్లతో వై సైడ్ మార్కెట్, కోటి 40 లక్షలతో పాత బస్టాండ్ లో మరో సమీకృత మార్కెట్ నిర్మాణం, పదిహేను వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో వనపర్తి పేద ప్రజల జీవితాలతో సమూలమైన మార్పు వస్తుంది. సాగునీటి లభ్యత పెరగడంతో పంటల దిగుబడి పెరిగింది. చిట్యాల వద్ద నూతన వ్యవసాయ మార్కెట్, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయించారు. గొర్రెల వేరుశనగ పరిశోధన కేంద్రాలు డబల్ బెడ్రూమ్ ఇండ్ల, వనపర్తి మెడికల్ కళాశాల ఫిషరీస్ కళాశాల ఏర్పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖిల్లాఘణపురం ,పెద్దమందడి ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, సకాలంలో ప్రజలకు అందించడంలో వనపర్తి ఎమ్మెల్యే ముందుంటారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రోడ్డు నిర్మాణం, సమీకృత కూరగాయల మార్కెట్, గ్రంథాలయ భవనం, ట్యాంక్ బండ్ నిర్మాణం తదితర పనులు పూర్తయితే కొత్త వనపర్తి ని చూడవచ్చు అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : సోమనాద్రినగర్‌కు పొంచి ఉన్నముప్పు

టీ మీడియా, జులై 15, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. 2001లో రాష్ట్ర సాధన కోసం స్థాపించిన టిఆర్ఎస్ పార్టీలో చేరి మహబూబ్ నగర్లో దశాబ్దకాలం పాటు టీఆర్ఎస్ ను ఒంటిచేతితో నడిపించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా బతుకు చిత్రాన్ని తెలంగాణ ఉద్యమంలో బట్టబయలు చేసిన నాయకుడిగా నిరంజన్ రెడ్డి గుర్తింపు పొందాడు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 4291 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టిఎంసిలు ఉన్నా నీటి కేటాయింపును 40 టీఎంసీలకు పెంపుదల చేసి జీవో విడుదల అయ్యేలా కృషి చేశారు. 11 నెలలో ఖిల్లా ఘణపురం కాలువను 40 రోజులలో పెద్దమందడి కాల్వలు తవ్వించి సాగునీరు తీసుకువచ్చారు. వనపర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాత ఎన్నికల నామినేషన్ వేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నికలలో పోటీకి నిలబడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, వనపర్తి, గోపాల్పేట, రేవెల్లి మండలాలు భీమా ద్వారా వనపర్తి లో కొంతభాగం శ్రీరంగాపురం మండలాలలో సస్యశ్యామలం అవుతున్నాయి. అంటే దానికి కారణం నిరంజన్ రెడ్డి 2018 ముందస్తు ఎన్నికలలో వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిరంజన్ రెడ్డి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై 51,783 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 లో కెసిఆర్ రెండవ మంత్రివర్గంలో వ్యవసాయ సహకార పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించారు. ప్రధానంగా వనపర్తి జిల్లా సాధించడం, వనపర్తి జిల్లాలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఎన్ని చెరువులను నింపే కార్యక్రమం, 40 ఏళ్ల నుంచి కాని రోడ్డు వెడల్పు అందర్నీ ఒప్పించి చేస్తున్నా కార్యక్రమం వనపర్తి నడిబొడ్డున 19.50 కోట్లతో సమీకృత మార్కెట్ రెండు అంతస్తులతో 85 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. 50 వ్యాపార దుకాణాలు, 120 కూరగాయల దుకాణాలు, సూపర్ మార్కెట్, చిల్డ్రన్ పార్క్, 24 దుకాణాలు, పండ్ల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఎకో పార్క్ సమీపంలో 3 కోట్లతో వై సైడ్ మార్కెట్, కోటి 40 లక్షలతో పాత బస్టాండ్ లో మరో సమీకృత మార్కెట్ నిర్మాణం, పదిహేను వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంతో వనపర్తి పేద ప్రజల జీవితాలతో సమూలమైన మార్పు వస్తుంది. సాగునీటి లభ్యత పెరగడంతో పంటల దిగుబడి పెరిగింది. చిట్యాల వద్ద నూతన వ్యవసాయ మార్కెట్, జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయించారు. గొర్రెల వేరుశనగ పరిశోధన కేంద్రాలు డబల్ బెడ్రూమ్ ఇండ్ల, వనపర్తి మెడికల్ కళాశాల ఫిషరీస్ కళాశాల ఏర్పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఖిల్లాఘణపురం ,పెద్దమందడి ఎత్తిపోతల పథకం పూర్తి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి సహాయనిధి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, సకాలంలో ప్రజలకు అందించడంలో వనపర్తి ఎమ్మెల్యే ముందుంటారని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రోడ్డు నిర్మాణం, సమీకృత కూరగాయల మార్కెట్, గ్రంథాలయ భవనం, ట్యాంక్ బండ్ నిర్మాణం తదితర పనులు పూర్తయితే కొత్త వనపర్తి ని చూడవచ్చు అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube