పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి, ఎమ్మెల్యే

టీ మీడియా,మే09 , మధిర:

సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధిర మండలం మరియు టౌన్ లో విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సొసైటీ గోడాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ నుండి మధిర చేరుకొని పట్టణంలో అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించి అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పౌంటెన్ ను ప్రారంభించారు.

Also Read : ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కేటుగాడి అరెస్ట్

అలానే మధిర పట్టణంలో అంబారు పేట రోడ్డు చెరువు కట్ట పై 5.75 కోట్లతో నిర్మించనున్న ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు 4.70 కోట్లతో నిర్మించబోయే వెజ్ – నాన్ వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అలానే నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు .అనంతరం పువ్వాడ ఫౌండేషన్ ద్వారా మధిర పట్టణంలో టీ అర్ యస్ జిల్లా నాయకులు మల్లాది వాసు నివాసంలో పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు తర్వాత అక్కడ నుండి మధిర మండలం ఆత్కూర్ గ్రామం చేరుకొని అబ్బూరి రామకృష్ణ విగ్రహ ఆవిష్కరణ చేసి అక్కడే గ్రామ సెంటర్లో నూతనంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్ ప్రారంభించారు. అలానే ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అబ్బూరి రామకృష్ణ సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగించారు.

Also Read : ముంబైలో దావూద్‌ సహచరులపై ఎన్‌ఐఏ దాడులు

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నాయకులు బొమ్మెర రామూర్తిపలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube