గతంలో జరగని అభివద్ధి ఇప్పుడు జరుగుతోంది

గతంలో జరగని అభివద్ధి ఇప్పుడు జరుగుతోంది

0
TMedia (Telugu News) :

గతంలో జరగని అభివద్ధి ఇప్పుడు జరుగుతోంది

– ఏపి సీఎం జగన్‌

టీ మీడియా, అక్టోబర్ 19, కర్నూలు : ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం కింద 3,25,020 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.325.02 కోట్లు జమ చేశారు సీఎం జగన్‌. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున చేదోడు సాయం అందించారు. ఈ విడతలో 1,04,551 మంది రజకులకు రూ.104.55 కోట్లు, 1,80,656 మంది టైలర్లకు రూ.180.66 కోట్లు, 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.39.81 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సిఎం జగన్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్‌ మారలేదన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు. అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలను కోరారు. కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. గతంలో పొదుపు సంఘాల మహిళల సమస్యలు తొలగిపోవాలంటే చంద్రబాబు పాలన రావాలంటూ టీవీల్లో అడ్వర్టైజ్‌ మెంట్‌ వచ్చేదని జగన్‌ గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా పొదుపు సంఘాల మహిళల కష్టాలు మాత్రం పోలేదని వివరించారు.

Also Read : చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ

ఉన్న కష్టాలు తీరకపోగా అప్పటి వరకు వచ్చిన సున్నా వడ్డీ పథకం కూడా చంద్రబాబు ఎత్తేశారని విమర్శించారు. రైతన్నలకూ ఇదే పరిస్థితి ఎదురైందని, పంట రుణాల మాఫీ విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, సున్నా వడ్డీ పథకానికి రైతులు దూరమయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గజదొంగల ముఠా ఉండేదని, ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమం జరిగేదని జగన్‌ విమర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube