అవినీతి నియంత్రణతో పురోభివృద్ధివైపు

ఉపరాష్ట్రపతి వెంకయ్య

1
TMedia (Telugu News) :

అవినీతి నియంత్రణతో పురోభివృద్ధివైపు

-ఉపరాష్ట్రపతి వెంకయ్య
టి మీడియా,జూలై25,న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుల కలలు సాకారం చేయాల్సి ఉందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ‘సబ్‌కా ప్రయాస్‌-సబ్‌కా కర్తవ్య్‌’ నినాదంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. అమృత్ మహోత్సవ్‌ వేళ మరింత వేగవంతంగా పనిచేయాలని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతూ.. అవినీతి నియంత్రణతో దేశం పురోభివృద్ధివైపు పయనిస్తున్నదని చెప్పారు.

 

Also Read : మహాత్మునికి నివాళులర్పించిన ద్రౌపది ముర్ము

భారత జవాన్ల శౌర్యానికి నిదర్శనంగా రేపు విజయ్‌ దివస్‌ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. జవాన్లు, దేశ ప్రజలందరికీ విజయ్‌ దివస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అభివద్ధి నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పారు. స్థిరమైన జీవన విధానం చాలా అవసరమని వెల్లడించారు. అటవీ సంపద, నీటి వనరుల ప్రాధాన్యం గుర్తించాలని, ప్రకృతి సంపదను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube