టీ మీడియా అశ్వారావుపేట అక్టోబర్ 25
నియోజకవర్గ కేంద్రంలోని కోనేటి బజార్ లో వేంచేసియున్న అన్నపూర్ణ సహిత విశ్వేశ్వర ఆలయం నందు అస్వయుజ మాసం పంచమి సోమవారం శుభదినం పురస్కరించుకుని 17 మంది శివభక్తులు గురు స్వామి ఏసు,శ్రీరామూర్తి ఆధ్వర్యంలో శివమాలలు ధరించారు నేటి నుండి 41 రోజుల పాటు శివదీక్ష అనంతరం మహారాష్ట్ర భీమశంకర్ లోని జ్యోతిర్లింగం నందు ఇరుముడి సమర్పించుటకు భక్తులు నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా టెకీ నాగు స్వామి మాట్లాడుతూ 12 జ్యోతిర్లింగాల దర్శనార్థం ఇప్పటివరకు ఐదు జ్యోతిర్లింగాలను సందర్శించడం జరిగిందని ప్రతి సంవత్సరం ఒకొక్క జ్యోతిర్లింగాన్ని ఆ శివయ్య కృపతో దర్శించుకుంటున్నట్లు తెలిపారు. శివ మాల ధరించిన భక్త్తులు మోహనరావు,కంచర్ల కిరణ్, శ్రీకాకుళపు ప్రసాద్,వెంకటేశ్వరరావు, నాగరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.