ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజ

ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజ

1
TMedia (Telugu News) :

ఘనంగా అయ్యప్పస్వామి పడి పూజ

 

టీ మీడియా, నవంబర్ 19, వనపర్తి బ్యూరో : కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలం మందాపూర్ గ్రామ కాంగ్రెస్ యువ నాయకులు రోహిత్ సాగర్ స్వామి ఆహ్వానం మేరకు వారి ఇంట్లో జరుగుతున్న అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్ని ప్రత్యేక పూజ నిర్వహించిన టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యలు పాడిపంటలతో కలకాలం వర్ధిల్లాలని వేడుకున్న టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు.

Also Read : మానవత్వం చాటుకున్న గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీవాణి

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నరసింహ , వనపర్తి జిల్లా కార్యదర్శి బుసిరెడ్డిపల్లి కృష్ణ ,పాన్గల్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వామి, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శాఖాపూర్ సుధాకర్ యాదవ్, మల్లయిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ బుచ్చరెడ్డి, మాజీ సర్పంచ్ ఆదిచంద్రయ్య, మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube