శివ కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన: మున్సిపల్ పాలకవర్గం

శివ కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన: మున్సిపల్ పాలకవర్గం

1
TMedia (Telugu News) :

శివ కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన: మున్సిపల్ పాలకవర్గం

టీ మీడియా, మార్చి 22 ,వేములవాడ:దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శివ కల్యాణం సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పాలకవర్గ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు,పట్టణ ప్రముఖులు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి మన వేములవాడ పట్టణంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో భాగంగా స్వామివార్లకు పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించడం జరిగిందని వేములవాడ పట్టణానికి గొప్ప చరిత్ర ఉందని ఏ శైవ క్షేత్రమైన లోనైనా మహాశివరాత్రి రోజే శివ కళ్యాణం జరుపుతారని కానీ మన వేములవాడ దేవస్థానంలో కామ దహనం తర్వాత శివ కళ్యాణం నిర్వహిస్తారని. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ రాజరాజేశ్వర స్వామి నీ వేడుకోవడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ శ్యామ్ సుందర్ రావు,గౌరవ పాలకవర్గ సభ్యులు,మరియు కోఆప్షన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు నాయకులు,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read : కానిస్టేబుల్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందజేత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube